యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం ..10 మంది కూలీల దుర్మరణం
- కూలీలతో వెళుతున్న టాక్టర్‌ను ఢీకొన్న ట్రక్కు
- ఘటనా స్థలంలోనే పది మంది మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
- బనారస్ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు క్షతగాత్రుల తరలింపు
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది కూలీలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలతో వారణాసి వైపు వెళుతున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
కచ్వా సరిహద్దు జిట్ రోడ్డులో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ట్రక్ అదుపుతప్పి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడటంతో వారిని బనారస్ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కూలీలు భదోహా జిల్లాలో పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.