ఘనంగా జరిగిన దేవర సక్సెస్ సెలబ్రేషన్స్
- హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ వేడుక
- హాజరైన టాలీవుడ్ ప్రముఖులు
- సక్సెస్ జోష్‌లో కనిపించిన ఎన్టీఆర్
ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందిన ద్వితీయ చిత్రం దేవర. ఇంతకు ముందు ఈ కాంబినేషన్‌లో జనతా గ్యారేజీ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 27న పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర టాక్‌పరంగా మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చినా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. దసరా సెలవులు ఈ చిత్రానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజీగా మారాయి. రానున్న రోజుల్లో పెద్ద చిత్రమేమీ లేకపోవడంతో దసరా సెలవుల్లో దేవరదే హవా అని డిసైడ్ అయిపోయింది.
ఇదిలా వుండగా ఈ సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు అమెరికాకు వెళ్లిన హీరో ఎన్టీఆర్ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వాస్తవంగా గురువారం రోజు ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుక గుంటూరులో అభిమానుల మధ్య జరగాలి. అయితే అనుకోని కారణాల వల్ల కుదరలేదు. దేవి నవరాత్రుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సక్సెస్‌మీట్‌కు పోలీసుల అనుమతి లభించలేదు.
ఈ విషయమై దేవర పంపిణీదారుడు, నిర్మాత నాగవంశీ అభిమానులను క్షమాపణలు కూడా కోరిన సంగతి తెలిసిందే. కాగా దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గురువారం హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఘనంగా జరిగాయి. అభిమానులకు, మీడియాకు దూరంగా జరిగిన ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్‌తో పాటు చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో పాటు నిర్మాతలు దిల్‌రాజు, నందమూరి కళ్యాణ్‌రామ్, దానయ్య, నాగవంశీ, దేవర పంపిణీదారులు తదితరులు పాల్గొన్నారు.