భారత స్టాక్ మార్కెట్ భారీ పతనం... రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
- ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయాలు
- భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
- గత రెండు నెలల్లో ఇదే అత్యంత భారీ పతనం
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి భారత స్టాక్ మార్కెట్ పై నేడు తీవ్ర ప్రభావం చూపాయి. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయాలు, ఉద్రిక్తతతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు విలవిల్లాడాయి. మదుపరులకు చెందిన రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. భారత స్టాక్ మార్కెట్లో గత రెండు నెలల్లో ఇది అత్యంత భారీ పతనం.
ఇవాళ ట్రేడింగ్ ఆరంభం నుంచే సూచీలు డౌన్ ట్రెండ్ లో పయనించాయి. సెన్సెక్స్ 1,769 పాయింట్ల నష్టంతో 82,497 వద్ద ముగిసింది. నిఫ్టీ 547 పాయింట్లు కోల్పోయి 25,250 వద్ద ముగిసింది.
జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ షేర్లు లాభాలు ఆర్జించగా... బీపీసీఎల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ నష్టాలు చవిచూశాయి.