రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతోంది... మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే: వైఎస్‌ జగన్‌

  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ శ్రేణుల‌తో జ‌గ‌న్ భేటీ
  • ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు భరోసా క‌ల్పించిన వైసీపీ అధినేత‌
  • చంద్రబాబు అబద్ధాలు ఇప్పుడు మోసాలుగా మారాయని విమ‌ర్శ‌
  • వైసీపీ, టీడీపీ మధ్య తేడాను ప్రజలు గమనించారని వ్యాఖ్య‌
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీ, ఇతర నాయకులతో మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ వైఎస్‌ జగన్ ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు వైఎస్‌ జగన్‌ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతోంద‌ని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు.

రాజకీయాల్లో విశ్వసనీయత, వ్యక్తిత్వం అనేవి చాలా ముఖ్యమని తెలిపారు. కష్టం వచ్చినప్పుడు ప్ర‌జ‌ల‌కు అండగా నిలబడగ‌లిగితే అదే మ‌న‌ల్ని త‌ర్వాత విజ‌య‌తీరానికి చేరుస్తుంద‌ని కార్య‌క‌ర్త‌ల‌తో అన్నారు. 

గత ఐదేళ్లలో వైసీపీ ప్ర‌భుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చింద‌ని జగన్‌ తెలిపారు. చంద్రబాబు అబద్ధాలు ఇప్పుడు మోసాలుగా మారాయని దుయ్య‌బ‌ట్టారు. చంద్రబాబు మోసాలపై క్ర‌మంగా ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని అన్నారు. 

వైసీపీ, టీడీపీ మధ్య తేడాను ప్రజలు గమనించారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతోంద‌న్న జ‌గ‌న్‌.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.




More Telugu News