అవధూత దత్తపీఠంలో దత్తమండపం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి
- అవధూత దత్తపీఠం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్ష
- ఇదే ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా అయ్యే అవకాశం వచ్చిందన్న సీఎం
- ఈ క్షేత్రం ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్ష
హైదరాబాద్‌లోని దుండిగల్‌లో గల అవధూత దత్తపీఠంలో దత్తమండపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... అవధూత దత్తపీఠం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గతంలో ఇదే ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించానని, ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశం వచ్చిందన్నారు.
ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెంది ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారి ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మైసూర్‌లో నిర్వహించాల్సిన కార్యక్రమం దుండిగల్‌లో జరిపించడం స్వామివారు తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. ఈ నిర్ణయం ప్రజలందరికీ ప్రయోజనకారిగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.