సందర్భాన్ని బట్టి సినిమా వాళ్లపై మాట్లాడాము: మంత్రి సీతక్క
- ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లకు ఉంటుందన్న సీతక్క
- పనిగట్టుకొని తాము సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని వెల్లడి
- తాము సినిమా వాళ్లను ద్వేషించడం లేదని వ్యాఖ్య
పనిగట్టుకొని తాము సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లకు ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. సందర్భాన్ని బట్టి కొంతమంది సినిమా ప్రముఖులపై మాత్రమే కొండా సురేఖ మాట్లాడారన్నారు. సినీ నటులకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాళ్లను తాము ద్వేషించడం లేదన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... గతంలోని మహిళా మంత్రుల చరిత్ర, ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర అందరికీ తెలుసునన్నారు. తాము ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రులం అన్నారు.
ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్లాట్లుగా మార్చి అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అన్నారు. కేటీఆర్ చాటుగా మాట్లాడటం కాదని, నేరుగా వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. పండగపూట అనవసరంగా తమను విమర్శించవద్దని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. తాను, కొండా సురేఖ... సమ్మక్క, సారలమ్మ, రాణి రుద్రమదేవి ప్రాంతాల నుంచి వచ్చామన్నారు.
ప్రజలు వరదలతో ఇబ్బందిపడవద్దని ప్రభుత్వం ప్రక్షాళనను ప్రారంభించిందన్నారు. మూసీ కూల్చివేతల అంశంలో పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన విషయంలో తమను అసభ్యకరంగా దూషించి, శిఖండి అని ఎలా అంటారని నిలదీశారు.