అత్యంత గోప్యంగా పుష్ప-2 క్లైమాక్స్ చిత్రీకరణ.. కారణం ఏమిటంటే..!
- సినిమాలో కీలకంగా పతాక సన్నివేశాలు
- అత్యంత గోప్యంగా వుంచేందుకు ప్రయత్నం
- అతికొద్ది మందితో క్లైమాక్స్ చిత్రీకరణ
పుష్ప ది రైజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ చిత్రంతో హీరో అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నారు. ఈ చిత్రంలో ఈ అల్లు హీరో నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా తగ్గేదెలే అంటూ ఈ హీరో చేసిన మేనరిజం ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిపోయింది. ఈ చిత్రంలో నటనకు గాను ఈ ఐకాన్‌స్టార్ ప్రతిష్ఠాత్మక పురస్కారమైన కేంద్రప్రభుత్వం ఇచ్చే జాతీయస్థాయి ఉత్తమ నటుడి అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.
ఇక ప్రస్తుతం పుష్ప ది రైజ్ సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్ రూపొందుతోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. ఇప్పటికే పుష్ప-2 నుండి విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేస్తున్నారు.
అయితే ఇటీవల ఈ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ అత్యంత గోప్యంగా జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్‌లోని అతి కొద్దిమందితో ఈ చిత్రీకరణ చేశారట. సినిమాలో కీలకంగా భావించే ఈ సీన్స్‌ను సినిమా విడుదల వరకు బయటికి లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారట. పుష్ప ది రైజ్‌లో కూడా సినిమాకు పతాక సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి.
ముఖ్యంగా హీరో అల్లు అర్జున్- ఫహాద్ ఫాజిల్ మధ్య వచ్చే పతాక సన్నివేశాలు సినిమాకు మేజర్ ఆకర్షణగా నిలవడంతో పాటు ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరించాయి. పుష్ప-2 క్లైమాక్స్ కూడా ఇంతకు మించిన కిక్‌ను ప్రేక్షకులకు ఇవ్వబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. అంతేకాదు కేవలం పతాక సన్నివేశాలే కాకుండా సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా అల్లు అర్జున్ అభిమానులను ఉర్రూతలూగించే విధంగా వుంటుందట.