రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు పారదోలే రోజులు దగ్గరలో ఉన్నాయి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ పార్టీ వీధి రౌడీలకు చిరునామాగా మారిందని విమర్శ
- కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు... ప్రతీకార పాలన అని మండిపాటు
- తెలంగాణలో అసలేం జరుగుతోందని నిలదీత
శ్రీలంకలో రాజపక్సను పారదోలినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు పారదోలే రోజులు దగ్గర పడ్డాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వీధి రౌడీలకు చిరునామాగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అని మండిపడ్డారు. త్వరలో మూల్యం చెల్లించుకోవడం ఖాయమన్నారు.
తెలంగాణలో అసలేం జరుగుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? రాజ్యాంగబద్ధమైన తన విధులను నిర్వర్తించేందుకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ గూండాలు నిన్న కూడా తెలంగాణ భవన్‌పై దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు.