హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం విధిస్తూ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ
- డీజే కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు డయల్ 100కు ఫిర్యాదులు
- ఈ క్రమంలో డీజేపై నిషేధం విధించిన పోలీసులు
- డీజే నిషేధంపై ఇటీవలే రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయి. ఈ క్రమంలో డీజేలపై నిషేధం విధిస్తూ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
నగర సీపీ సీవీ ఆనంద్ ఇటీవల డీజే అంశంపై బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ రూంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండేళ్ళుగా డీజేలతో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన సాగుతోందని అన్నారు.