భూమిపై కొవిడ్ లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
- లాక్‌డౌన్ సమయంలో భూమిపై ఆగిపోయిన కార్యకలాపాలు
- ఆ ప్రభావం చంద్రుడిపైనా పడిందన్న శాస్త్రవేత్తలు
- మనకు కనిపించే చంద్రుడి ఉపరితలంపై 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతల తగ్గుదల
ప్రపంచమంతా కరోనా లాక్‌డౌన్ మధ్య గది గోడలకే పరిమితమైన వేళ చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్-19 ప్రపంచాన్ని క్రమంగా కబళిస్తుండడంతో తొలుత చైనా లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా అన్ని వ్యవస్థలు స్తబ్దుగా మారిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోగా, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో గ్రీన్‌హౌస్ ఉద్గారాల విడుదల పూర్తిగా ఆగిపోయింది.
ఇక ఈ ప్రభావం చంద్రుడిపైనా పడినట్టు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ (పీఆర్ఎల్)కు చెందిన శాస్త్రవేత్తలు కె.దుర్గాప్రసాద్, జి.అంబ్లీ నిర్వహించిన అధ్యయనంలో వెలుగుచూసింది. ఈ అధ్యయన వివరాలు పీర్ రివ్యూడ్ జర్నల్ ‘మంత్లీ నోటీసెస్ ఆఫ్ రాయల్ అస్ట్రోనామికల్ సొసైటీ: లెటర్స్’లో ప్రచురితమయ్యాయి. 2020 ఏప్రిల్-మే మధ్య లాక్‌డౌన్ సమయంలో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినట్టు అధ్యయనం పేర్కొంది. నాసాకు చెందిన లూనార్ రీకనాయిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్‌వో) డేటాను విశ్లేషించగా ఈ విషయం బయటపడింది.
అధ్యయనం ఎలా చేశారు?
చంద్రుడిపై మనకు కనిపించే భాగంలోని ఆరు ప్రత్యేక ప్రాంతాల్లోని ఉపరితలంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరంగా అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే లాక్‌డౌన్ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 8 నుంచి 10 (డిగ్రీలు) కెల్విన్ (కే) పడిపోయినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా 2017 నుంచి 2023 వరకు డేటాను విశ్లేషించారు. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే అందుకు కారణమని పేర్కొన్నారు.