క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఇంటికి వెళ్లాక ఊహించని దారుణం
- ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ దారుణ హత్య
- రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్ ఆర్డర్ ఇచ్చి చంపేసిన వైనం
- గొంతు నులిమి ప్రాణాలు తీసిన ఇద్దరు వ్యక్తులు
- ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వెలుగుచూసిన దారుణం
ఐఫోన్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన డెలివరీ బాయ్ దారుణ హత్యకు గురైన సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వెలుగుచూసింది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని తేలింది. నగరంలోని చిన్‌హాట్ ప్రాంతానికి చెందిన గజానన్ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌పై రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు. క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపు విధానాన్ని ఎంచుకున్నాడు. ఫోన్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన 30 ఏళ్ల భరత్ సాహు అనే డెలివరీ వ్యక్తిని గజానన్ హత్య చేశాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశాంక్ సింగ్ వెల్లడించారు.
డెలివరీ బాయ్‌ని గొంతు నులిమి చంపేశారని, గజానన్‌కు ఆకాశ్ అనే స్నేహితుడు సాయపడ్డాడని సోమవారం వివరించారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఒక గోనె సంచిలో వేసి తీసుకెళ్లి సమీపంలోని ఇందిరా కెనాల్‌లో పడేశారని అధికారి వివరించారు. కాలువలో మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం గాలిస్తోందని చెప్పారు. సెప్టెంబర్ 23న ఈ మర్డర్ జరిగిందని అధికారి శశాంక్ సింగ్ వివరించారు.
కాగా హత్యకు గురైన వ్యక్తి పేరు భరత్ సాహు అని, నగరంలోని నిషాత్‌గంజ్ వాసి అని వెల్లడించారు. సాహు రెండు రోజులపాటు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడు అదృశ్యమైనట్టు సెప్టెంబర్ 25న చిన్‌హట్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చెప్పారు. సాహు కాల్ డేటా, ఫోన్ లొకేషన్‌ను పరిశీలించగా గజానన్‌కు చివరిసారి ఫోన్ చేసినట్టు తేలిందని చెప్పారు. దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడిందని వివిరించారు. గజానన్, అతడి స్నేహితుడు ఆకాశ్‌ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. విచారణలో ఆకాశ్ నేరాన్ని అంగీకరించాడని అధికారి శశాంక్ సింగ్ తెలిపారు. కాలువలోని మృతదేహాన్ని ఇంకా కనుగొనలేదని, ఎస్‌డీఆర్ఎఫ్ బృందం మృతదేహం కోసం గాలిస్తోందని చెప్పారు.