పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై నెతన్యాహుతో మాట్లాడాను: ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ పై హమాస్ దాడులతో మొదలైన మారణహోమం
- పగతో రగిలిపోతున్న ఇజ్రాయెల్
- హమాస్, హెజ్బొల్లా, హౌతీ మిలిటెంట్లపై నిప్పుల వర్షం
- శాంతి స్థాపన, స్థిరత్వం నెలకొల్పే చర్యలకు తమ మద్దతు ఉంటుందన్న మోదీ
ఏకకాలంలో పలు మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్ పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. లెబనాన్ అతివాద గ్రూపు హెజ్బొల్లా నాయకత్వాన్ని తుదముట్టించిన ఇజ్రాయెల్... తాజాగా యెమెన్ మిలిటెంట్ సంస్థ హౌతీపైనా విరుచుకుపడుతోంది.
ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు.
శాంతి స్థాపన, స్థిరత్వం నెలకొల్పే చర్యలకు మద్దతు ఇవ్వాలనేది తమ వైఖరిని, అందుకు తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి తావులేదని అన్నారు. ఉద్రిక్తతలు మరింత విస్తరించకుండా చూడాల్సిన అవసరం ఉందని, బందీలను విడిచిపెట్టడం అనేది ముఖ్యమైన అంశమని మోదీ అభిప్రాయపడ్డారు.