కర్ణాటక సీఎంపై కేసు నమోదు చేసిన ఈడీ

  • సీఎంతో పాటు మరికొందరి పేర్లను పేర్కొన్న ఈడీ
  • ముడా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య
  • లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాఫ్తునకు కోర్టు అనుమతి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ కేసు నమోదు చేసింది. ముడా స్కాంలో సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాఫ్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడంతో ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసింది.

ఆ ఎఫ్ఐఆర్‌లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొంది. ఆయన కుటుంబంలోని పలువురి పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా పేర్కొంది. ఈ ఎఫ్ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ... ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు మరికొందరి పేర్లను కూడా అందులో పేర్కొంది.


More Telugu News