ఏపీలో వరద బాధితులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల భారీ విరాళం
- ఇటీవల ఏపీలో భారీ స్థాయిలో వరదలు
- ఇప్పటికీ ముందుకొస్తున్న దాతలు
- రూ.5.9 కోట్ల విరాళం అందించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు
ఏపీలో ఇటీవల సంభవించిన వరదలు లక్షలాది మందిపై ప్రభావం చూపాయి. దాతలు పెద్ద మనసుతో స్పందించి వరద బాధితులకు విరాళాలు అందిస్తున్నారు.
తాజాగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఉద్యోగులు ఏపీ వరద బాధితుల సహాయార్థం రూ.5.9 కోట్ల భారీ విరాళం అందించారు. ఆ మేరకు యూబీఐ సీఈవో, ఎండీ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు.
అటు, మంత్రి నారా లోకేశ్ ను కలిసి పలువురు విరాళాల చెక్కులు అందించారు. కేరళకు చెందిన పెన్వర్ ప్రొడక్ట్స్ సంస్థ ఎండీ ఫిలిప్స్ థామస్ రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. శశి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ రూ.25 లక్షలు అందించారు.