అక్టోబరు నెలలో వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!
- అక్టోబరు మాసంలో భారీ సంఖ్యలో పండుగలు, పర్వదినాలు
- కశ్మీర్ లో రేపు ఎన్నికలు
- బ్యాంకులకు భారీగా సెలవులు
అక్టోబరు నెలలో దసరా, దీపావళి వంటి రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. అదే సమయంలో, పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక పండుగలు కూడా అక్టోబరు నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.
సెలవుల వివరాలు...
సెలవుల వివరాలు...
- అక్టోబరు 1- జమ్ము కశ్మీర్ లో రేపు తుది విడత పోలింగ్. బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
- అక్టోబరు 2- మహాత్మా గాంధీ జయంతి, మహాలయ అమావాస్య... దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
- అక్టోబరు 3- నవరాత్ర స్థాపన.. రాజస్థాన్ లో బ్యాంకులకు సెలవు
- అక్టోబరు 10- దుర్గాపూజ/దసరా (మహా సప్తమి)... నాగాలాండ్, త్రిపుర, బెంగాల్, అసోంలో బ్యాంకులకు సెలవు
- అక్టోబరు 12- దసరా (విజయదశమి) , దుర్గా పూజ, రెండో శనివారం... అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
- అక్టోబరు 14- దుర్గా పూజ (దశయిన్)... సిక్కింలో బ్యాంకులకు సెలవు
- అక్టోబరు 16- లక్ష్మీ పూజ... బెంగాల్, త్రిపురలో బ్యాంకులకు సెలవు
- అక్టోబరు 17- వాల్మీకి జయంతి, కటీ బిహు... కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, అసోంలో బ్యాంకులకు సెలవు
- అక్టోబరు 26- కశ్మీర్ భారత యూనియన్ లో చేరిన రోజు... యాక్సెషన్ డే... జమ్ము, శ్రీనగర్ లో బ్యాంకులకు సెలవు
- అక్టోబరు 31- దీపావళి, నరక చతుర్దశి, కాళీ పూజ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి... సిక్కిం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.