ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
- డిజిటల్ కార్డులపై అధికారులతో సీఎం సమీక్ష
- కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫొటో తీయాలని ఆదేశం
- 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని సూచన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫొటోను తీయాలన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని సూచించారు.
డిజిటల్ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్ 3 నుంచి 7 వరకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామం, ఒక పట్టణం చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలన్నారు. పైలట్ ప్రాజెక్టు అనంతరం పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.