రోహిత్ శర్మ సాహసోపేత నిర్ణయం... ఆసక్తికరంగా కాన్పూర్ టెస్టు
- ఆసక్తికరంగా కాన్పూర్ టెస్టు
- 285/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన రోహిత్ శర్మ
- టీమిండియాకు 52 పరుగుల కీలక ఆధిక్యం
- నేడు ఆటకు నాలుగో రోజు... ఆట చివరికి 2 వికెట్లకు 26 రన్స్ చేసిన బంగ్లాదేశ్
కాన్పూర్ టెస్టులో ఇప్పటికే రెండున్నర రోజుల ఆట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా... 285/9 స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. తద్వారా టీమిండియాకు 52 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
ఇవాళ చివరి సెషన్ లో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు... ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. ఆ రెండు వికెట్లను రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టాడు. తొలుత ఓపెనర్ జకీర్ హసన్ (10) వికెట్ తీసిన అశ్విన్... కాసేపటికే హసన్ మహ్మూద్ (4)ను పెవిలియన్ చేర్చాడు. బంగ్లా జట్టు ఇంకా 26 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్ (7 బ్యాటింగ్), మొమినుల్ హక్ (0 బ్యాటింగ్) ఉన్నారు.
ఆటకు రేపు చివరి రోజు కాగా... ఉదయం సెషన్ లో వీలైనంత తక్కువ స్కోరుకే బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేయాలన్నది రోహిత్ శర్మ ప్లాన్! ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలన్న రోహిత్ శర్మ నిర్ణయం మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేసింది.
టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం, బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడింది. యశస్వి జైస్వాల్ 72, కెప్టెన్ రోహిత్ శర్మ 23, శుభ్ మాన్ గిల్ 39, కోహ్లీ 47, కేఎల్ రాహుల్ 68 పరుగులు చేశారు. కోహ్లీ, కేఎల్ రాహుల్ ఫామ్ లోకి రావడం టీమిండియా శిబిరంలో ఆనందం నింపింది.