జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

  • బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పోలీసుల కౌంటర్
  • విచారణ సమయంలో బెయిల్ ఇవ్వవద్దని విజ్ఞప్తి
  • విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల (అక్టోబర్) 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నార్సింగి పోలీసులు... రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు.

జానీ మాస్టర్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కౌంటర్‌లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో అతనిని నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. ఇప్పటికే అతని నుంచి పలు విషయాలను రాబట్టారు. కాబట్టి ఈ సమయంలో బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు.


More Telugu News