మూడేళ్ల కూతురుతో కలిసి 18 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకిన తల్లి.. నార్సింగిలో విషాదం
- తీవ్ర గాయాలతో స్పాట్ లోనే తల్లీకూతుళ్ల దుర్మరణం
- అనారోగ్య కారణాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న సోదరుడు
- దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది.. మూడేళ్ల కూతురుతో పాటు ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడింది. తాము ఉంటున్న అపార్ట్ మెంట్ పైకెక్కి, 18 అంతస్తుల పై నుంచి కిందకు దూకింది. నార్సింగిలోని మైహోం అవతార్ అపార్ట్ మెంట్ లో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. భీమవరం ప్రాంతానికి చెందిన మానస భర్త, మూడేళ్ల వయసున్న కూతురు కృషితో కలిసి నార్సింగిలోని మైహోం అవతార్ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. కొంతకాలంగా మానస వెన్ను నొప్పితో బాధపడుతోందని ఆమె సోదరుడు తెలిపాడు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూతురుతో పాటు అపార్ట్ మెంట్ పై నుంచి దూకింది. 18 వ అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై తల్లీకూతుళ్లు స్పాట్ లోనే చనిపోయారు. అపార్ట్ మెంట్ వాసులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. మానస భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని, మానస అనారోగ్యం కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని నార్సింగి పోలీసులు తెలిపారు.