భారత క్రికెటర్ల సంఘం ప్రతినిధిగా చాముండేశ్వరీనాథ్... ఐపీఎల్ బోర్డులో చోటు
- బెంగళూరులో నేడు బీసీసీఐ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం
- చాముండేశ్వరనాథ్ కు ఐపీఎల్ పాలకమండలిలోనూ స్థానం
- ఐపీఎల్ పాలకమండలి ప్రతినిధులుగా అరుణ్ సింగ్, అవిషేఖ్ దాల్మియా ఎన్నిక
బెంగళూరులో ఇవాళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 93వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను బీసీసీఐ కార్యదర్శి జై షా మీడియాకు తెలిపారు.
భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) తన ప్రతినిధిగా వి.చాముండేశ్వరనాథ్ ను నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో, చాముండేశ్వరనాథ్ కు ఐపీఎల్ పాలకమండలిలో స్థానం లభించింది. తెలుగు క్రికెటర్, టీమిండియా మాజీ మేనేజర్ అయిన చాముండేశ్వరనాథ్ గతంలోనూ ఐపీఎల్ లో ఆటగాళ్ల సంఘం ప్రతినిధిగా వ్యవహరించారు.
ఇక, అరుణ్ సింగ్ ధుమాల్, అవిషేక్ దాల్మియా ఐపీఎల్ పాలకమండలికి ఎన్నికయ్యారు. ఈ మేరకు జై షా ఓ ప్రకటన విడుదల చేశారు. 2034-25 సీజన్ కు గాను బీసీసీఐ వార్షిక బడ్జెట్ కు ఈ సర్వసభ్య సమావేశంలో ఆమోదం లభించినట్టు జై షా వెల్లడించారు.
ఓ సొసైటీగా బీసీసీఐ చట్టపరమైన కొనసాగించాలని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు తెలిపారు. దేశవాళీ క్రికెట్ టోర్నీలతో పాటు, ఐపీఎల్ టోర్నీని కూడా బోర్డు పరిధిలోనే ఉంచాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపారు.