రేవంత్ అంకుల్.. మా ఇల్లు కూల్చేయద్దు ప్లీజ్.. వైరల్ వీడియో!
- హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన చిన్నారులు
- ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన పిల్లలు
- మా పేరెంట్స్ ను చూస్తే బాధనిపిస్తోందని మీడియాతో వ్యాఖ్యలు
హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా చిన్నారులు రోడ్డెక్కారు.. చేతులో ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు. రేవంత్ అంకుల్ మా ఇల్లు కూల్చేయద్దు ప్లీజ్ అంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. చిన్నారుల నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు చివరికి చిన్న పిల్లలను కూడా రోడ్డెక్కేలా చేసిందంటూ మండిపడుతున్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లాపాపలతో రోడ్డు మీదికి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదర్శకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కొంతమంది చిన్నారులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మా పేరెంట్స్ ను చూస్తే బాధనిపిస్తోందని వాపోయారు. ‘మా ఇల్లు మాకు కావాలి.. సీఎం సార్.. ప్లీజ్ హెల్ప్ చేయండి’ అంటూ ఓ చిన్నారి మీడియా ద్వారా ముఖ్యమంత్రిని కోరింది.