హ‌త‌మైన న‌స్రల్లా స్థానంలో హిజ్బొల్లా కొత్త చీఫ్‌గా హ‌షీమ్ సఫియెద్దీన్.. 1990లలోనే నిర్ణయం

  • బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నస్రల్లా హతం
  • నస్రల్లాకు సఫియెద్దీన్ కజిన్
  • ఇద్దరూ ఒకేసారి హిజ్బొల్లాలో చేరిక
  • ఇజ్రాయెల్ దాడుల్లో సఫియెద్దీన్ కూడా మృతి చెందినట్టు తొలుత వార్తలు
  • వాటిలో నిజం లేదని పేర్కొన్న ‘రాయిటర్స్’
లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమైన హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా స్థానాన్ని హషీమ్ సఫియెద్దీన్ భర్తీ చేశాడు. హిజ్బొల్లాకు 32 ఏళ్లపాటు పనిచేసిన నస్రుల్లాకు సఫియెద్దీన్ కజిన్. ఇజ్రాయెల్ దాడుల్లో సఫియెద్దీన్ కూడా హతమైనట్టు నిన్న వార్తలు వచ్చాయి.  అయితే, అతడు బతికే ఉన్నాడని తాజాగా ‘రాయిటర్స్’ పేర్కొంది. 

సఫియెద్దీన్ కూడా నస్రుల్లాతోపాటే హిజ్బొల్లాలో చేరాడు. దక్షిణ లెబనాన్‌లో 1964లో జన్మించాడు. సఫియెద్దీన్ 1990లలో ఇరాన్‌లో చదువుకుంటున్నప్పుడే బీరుట్ పిలిపించారు. అప్పుడే అతడు హిజ్బొల్లాలో నంబర్ 2 అని, నస్రల్లా తర్వాత బాధ్యతలు చేపట్టేది అతడేనని డిసైడేపోయింది. 

అమెరికా 2017లో సఫియెద్దీన్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఇప్పుడు నస్రల్లా మృతితో అనుకున్నట్టుగానే హిజ్బొల్లా బాధ్యతలు స్వీకరించాడు. కాగా, ఇజ్రాయెల్ దాడుల్లోనే 1997లో నస్రల్లా కొడుకు హదీ హతమవగా, తాజాగా నస్రల్లాతోపాటు అతడి కుమార్తె జైనాబ్ కూడా మృతి చెందారు. అయితే, జైనాబ్ మృతిని ధ్రువీకరించాల్సి ఉంది.


More Telugu News