తిరుమల మెట్ల మార్గంలో మరోసారి కలకలం రేపిన చిరుత
- శనివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు వచ్చిన చిరుత
- చిరుతను వెంబడించిన కుక్కలు
- భయంతో కంట్రోల్ రూమ్‌లోకి పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది
ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఎక్కడికెక్కడి నుండో భక్తులు తరలి వస్తుంటారు. కొండపైకి చాలా మంది భక్తులు నడక మార్గంలో వెళుతుంటారు. అయితే గత ఏడాది నుండి నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.
గత ఏడాది మెట్ల మార్గంలో ఓ బాలికపై చిరుత దాడి చేయడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో మెట్ల మార్గంలో టీటీడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఆంక్షలను విధించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అటవీశాఖ అధికారులు కొన్ని చిరుతలను పట్టుకుని జూలో వదిలేశారు.
తాజాగా మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు ఓ చిరుత వచ్చింది. చిరుతను గమనించిన కుక్కలు దాన్ని వెంబడించాయి. సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు.