నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్!
- తమిళనాడు సీఎం స్టాలిన్ పంపిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపిన గవర్నర్ ఆర్ఎన్ రవి
- మనో తంగరాజ్ సహా ముగ్గురు మంత్రులకు స్టాలిన్ క్యాబినెట్ నుండి ఉద్వాసన
- మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో పాటు డాక్టర్ గోవి చెళియన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాజర్‌లకు స్టాలిన్ క్యాబినెట్‌లో చోటు
తమిళనాడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మూహూర్తం ఫిక్స్ అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం స్టాలిన్ చేసిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రపోజల్‌కు గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న ఆమోదం తెలిపారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం ఉదయనిధి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి, రెండు రోజుల క్రితమే బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని మళ్లీ స్టాలిన్ మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. అలానే డాక్టర్ గోవి చెళియన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాజర్‌లను కూడా క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. మనో తంగరాజ్ సహా ముగ్గురు మంత్రులకు స్టాలిన్ క్యాబినెట్ నుండి ఉద్వాసన పలికారు.