లడ్టూ కల్తీ జరిగిందని కొన్ని యూట్యూబ్ చానళ్ల ద్వారా గట్టిగా ప్రచారం చేయించారు: సజ్జల

  • లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయన్న సజ్జల
  • బుడమేరు వరదలపై చర్చను డైవర్ట్ చేసి లడ్డూ వివాదం వైపు మళ్లించారని సజ్జల వ్యాఖ్యలు
  • లడ్డూ నాణ్యంగా ఉండటం వల్లనే అయోధ్య రామాలయం వారు తీసుకోవడానికి ముందుకు వచ్చారన్న సజ్జల
శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లడ్డూ కల్తీ జరిగిందని బలంగా ప్రచారం జరిపించారని విమర్శించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్దమయ్యారని, మరో పక్క సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని చెప్పారు. మామూలుగా అయితే చంద్రబాబు చేసిన అపచార వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లవని అన్నారు. ఆ పాపం చంద్రబాబుదే అనే నిజం ప్రజలకు తెలియాలన్నారు. అయోధ్య రామాలయం వారు కూడా టీటీడీ విధానం నచ్చి ఇక్కడి నుండి లడ్డూలు తీసుకోవడానికి ముందుకు వచ్చారని తెలిపారు. 

కల్తీ లేకుండా ప్రసాదాలు, భోజనాలు అందించిన చరిత్ర టీటీడీకి ఉందని, ఇప్పుడు ఆ నమ్మకాన్ని చంద్రబాబు పొగొట్టే ప్రయత్నం చేశాడని విమర్శించారు. షోకాజ్ నోటీసులో జంతువుల కొవ్వుకు సంబంధించిన అంశమే లేదని అన్నారు. జంతువుల కొవ్వు ఉన్నట్లు ఏ రిపోర్టులోనూ చూపించడం లేదన్నారు.  ముఖ్యమంత్రే జంతువుల కొవ్వు ఉందని ప్రస్తావించినా కూడా నోటీసులో ఎందుకు చేర్చలేదని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు ఘోరమైన అబద్దం ఆడారని విమర్శించారు. యానిమల్ ఫ్యాట్ అని చెప్పినా రిపోర్టులో ఎందుకు లేదని ప్రజలందరూ ఆడగాలన్నారు. బుడమేరు వరదలపై చర్చను డైవర్ట్ చేసి లడ్డూ వివాదం వైపు మళ్లించారని సజ్జల మండిపడ్డారు. డిక్లరేషన్ పై టీటీడీ వారు మాట్లాడాలి కానీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుందని ప్రశ్నించారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తే బీజేపీ స్పందించడం లేదని అన్నారు. చంద్రబాబును బీజేపీ ప్రశ్నించాల్సింది పోయి మాపై మాట్లాడుతున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి పట్టుదలకు పోకుండా టీటీడీకి వెళ్లకుండా ఆగిపోయారన్నారు. జగన్ వెళ్తే అక్కడ అనవసర సీన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారని, దాని వల్ల అక్కడ ఉన్న భక్తులకు ఇబ్బంది జరగకుండా జగన్ తిరుమల టూర్ క్యానిల్ చేసుకోవడం అభినందించాల్సిన విషయమని తెలిపారు. బుడమేరు వరదలపై చర్చను డైవర్ట్ చేసి లడ్డూ వివాదం వైపు మళ్లించారని అన్నారు. డిక్లరేషన్ అనేది మొదటి సారి వెళ్లినప్పుడు చేస్తారని, ఇన్నిసార్లు వెళ్లిన తర్వాత డిక్లరేషన్ ఎందుకని ప్రశ్నించారు.


More Telugu News