ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ మూసీ పైనే ఉంది కదా అంటే... దానకిశోర్ సమాధానం ఇదే!
- ఆ మెట్రో స్టేషన్ గురించి చర్చించి తగిన విధంగా స్పందిస్తామన్న దానకిశోర్
- మెట్రో స్టేషన్ విషయమై ఎన్జీవోలు కూడా అడిగినట్లు వెల్లడి
- ప్రభుత్వ ఆస్తుల విషయమై పైస్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్న దానకిశోర్
మూసీ నదిపై ఉన్న ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ విషయమై మీడియా ప్రతినిధులు మూసీ రివర్ ఫ్రండ్ ఎండీ దానకిశోర్‌ను ప్రశ్నించారు. ఈ మెట్రో స్టేషన్‌పై సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తామని ఆయన సమాధానం ఇచ్చారు.
ప్రెస్ మీట్ సందర్భంగా, మూసీ నదిలో ఉన్న ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఓ మీడియా ప్రతినిధి అడిగారు.
మూసీలో ఉన్న ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ గురించి కూడా చర్చించి తగిన రీతిలో స్పందిస్తామని తెలిపారు. ఈ మెట్రో స్టేషన్‌పై ఎన్జీవోలు కూడా తమని అడిగారని, అది కొంచెం సీరియస్ అంశమే అన్నారు. ఆలోచించాల్సిన అవసరం ఉందని సమాధానం చెప్పారు.
ప్రైవేటుకు సంబంధించిన ఆక్రమణలను తొలగిస్తున్నారు కదా, అలాంటి చోట్ల ప్రభుత్వం నిర్మించిన ఆస్తుల మాటేమిటి? అని ప్రశ్నించగా, దీనికి సంబంధించి పైస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తామన్నారు.