అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్‌ను తీసుకురావడానికి రెస్క్యూ మిషన్!

  • జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, బారీ విల్మోర్
  • స్టార్ లైనర్‌‌లో లీకేజీ కారణంగా భూమి మీదకు రాలేకపోయిన శాస్త్రవేత్తలు
  • స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ-9ను పంపించి భూమి మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు
నాసా శాస్త్రవేత్తలు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌లను అంతరిక్షం నుంచి భూమి మీదకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ మిషన్‌ను నాసా ఈరోజు ప్రారంభిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వీరు బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ, స్టార్ లైనర్‌లో హీలియం లీకేజీ, థ్రస్టర్లలో వైఫల్యం ఏర్పడింది. దాంతో, వారిని స్టార్ లైనర్ ద్వారా భూమి మీదకు తీసుకు రాలేకపోయారు.

వీరిని భూమి మీదకు తీసుకు రావడం కోసం నాసా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ-9ను పంపించి భూమి మీదకు తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ క్రూ-9 మిషన్ సెప్టెంబర్ 29 సాయంత్రం ఐదున్నర గంటలకు అంతరిక్షంలోకి వెళ్లనుంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా నలుగులు వ్యోమగాములు ప్రయాణించవచ్చు.


More Telugu News