ఒవైసీ ఆసుపత్రి, జన్వాడ ఫామ్‌హౌస్‌పై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
- ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్న రంగనాథ్
- విద్యా సంవత్సరం ముగిశాక వాటిపై చర్యలు ఉంటాయని వెల్లడి
- ఒవైసీ ఛాలెంజ్ చేస్తున్నారు కదా అంటే అలాంటి వాటిపై నో కామెంట్ అన్న రంగనాథ్
- జన్వాడ 111 జీవో పరిధిలో ఉందన్న హైడ్రా కమిషనర్
ఒవైసీ ఆసుపత్రిపై, జన్వాడ ఫామ్ హౌస్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అధికారులు, మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ఒవైసీ ఆసుపత్రి గురించి ప్రశ్నించారు.
ఒవైసీ ఆసుపత్రి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ, దానిని కూల్చేందుకు హైడ్రా, ప్రభుత్వం భయపడుతుందనే విమర్శలు వస్తున్నాయని, ఒవైసీకి భయపడే విద్యా సంవత్సరం వృథా పేరుతో వారికి ఆరు నెలల సమయం ఇస్తున్నట్లుగా చెబుతున్నారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. కానీ మీరు కూల్చివేతలు చేసిన చోట పేదలు, చిన్న చిన్న కుటుంబాలు ఉన్నారని, వారిని మాత్రం పట్టించుకోలేదని అడిగారు.
దీనిపై స్పందించిన రంగనాథ్, ఒవైసీది కావొచ్చు, మల్లారెడ్డి కాలేజీ కావొచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు కావొచ్చు... కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కానీ అందరికీ సమయం ఇస్తున్నామని తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమయం ఇచ్చామన్నారు. విద్యా సంవత్సరం ముగిశాక వాటిపై చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.
హైడ్రాను, ప్రభుత్వాన్ని ఒవైసీ ఛాలెంజ్ చేస్తున్నారు కదా అని సదరు మీడియా ప్రతినిధి తిరిగి ప్రశ్నించారు. అలాంటి వాటిపై నో కామెంట్ అని రంగనాథ్ అన్నారు.
తమ ప్రథమ టార్గెట్ పెద్దవాళ్లేనని స్పష్టం చేశారు. విల్లాస్‌లలో ఉన్నది చిన్నవాళ్లే కావొచ్చు... కానీ వాటి వెనుక పెద్దవాళ్లు ఉన్నారని తెలిపారు.
జన్వాడ ఫామ్ హౌస్‌పై కూడా రంగనాథ్ స్పందించారు. జన్వాడపై తాను మాట్లాడబోనని, ఎందుకంటే అది 111 జీవో పరిధిలో ఉందని, హైడ్రా పరిధిలోకి రాదన్నారు. తమ పరిధిలోనే మాట్లాడుతామని తెలిపారు.