బాలీవుడ్‌లో ప్రభావం చూపలేకపోయిన 'దేవర'!

  • హిందీలో స్లోగా దేవర వసూళ్లు 
  • తమిళ, మలయాళ భాషల్లోనూ అదే బాట 
  • తెలుగులో అదిరిపోయిన ప్రారంభ వసూళ్లు
ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌ నటించిన చిత్రం 'దేవర'. దాదాపు మూడేళ్ల విరామం తరువాత ఆయన నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకున్న దేవర వసూళ్ల విషయంలో మాత్రం స్ట్రాంగ్‌గానే వుంది. మొదటిరోజు ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి ప్రారంభ వసూళ్లను సాధించడమే కాకుండా డే వన్‌ వసూళ్లల్లో రికార్డులను కూడా నెలకొల్పింది. 

అయితే దేవర ప్రభావం కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమైంది. హిందీలో దేవర వసూళ్లు కాస్త మందకొండిగానే ఉన్నాయట. ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత నార్త్‌ ఇండియాలో మంచి మార్కెట్‌ను సంపాందించుకున్నారు. అయితే దేవర హిందీ వెర్షన్‌ కు ఎన్టీఆర్‌ పాపులారిటీకి తగ్గ వసూళ్లు రాలేదని తెలిసింది. 

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌లో దాదాపుగా రూ.300 కోట్లు వసూలు చేసింది. కానీ ఎన్టీఆర్‌ దేవరకు హిందీలో ఎక్స్‌పెక్ట్‌ చేసిన కలెక్షన్స్‌ రాలేదు. తొలిరోజు కేవలం రూ.7 కోట్లు మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఎన్టీఆర్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, హీరోయిన్‌ జాన్వీకపూర్‌ కూడా ఈ చిత్రంలో నటించారు. అయితే అల్లు అర్జున్‌ పుష్ప చిత్రం మొదటిపార్ట్‌ కూడా ఓపెనింగ్స్‌ స్లోగా వున్నా ఆ తరువాత వసూళ్లు ఊపందుకున్నాయి. బాలీవుడ్‌లో పుష్ప అత్యధిక వసూళ్లను సాధించింది. దేవరకు కూడా అలాంటి మ్యాజిక్‌ ఏమైనా వర్క్‌వుట్‌ అవుతుందేమో వేచి చూడాలి. 

దేవర తమిళ, మలయాళ భాషల్లో కూడా కలెక్షన్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని తెలిసింది. రెండు భాషల్లో కలిపి తొలిరోజు కోటి రూపాయలు మాత్రమే కలెక్ట చేసిందట. అయితే రానున్న దసరా సెలవులు, పాజిటివ్‌ మౌత్‌టాక్‌ దేవరకు కలిసొచ్చే అంశాలు అని, తప్పకుండా అన్ని భాషల్లో దేవర బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నమోదు అవ్వడం ఖాయమని  మేకర్స్‌ చెబుతున్నారు.


More Telugu News