ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ

  • అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్ అరెస్ట్
  • కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు విచారించిన పోలీసులు
  • అక్టోబర్ 3 వరకు జానీ మాస్టర్‌కు రిమాండ్ విధించిన కోర్టు
లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ శనివారం ముగిసింది. అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. జానీ మాస్టర్‌ను బుధవారం నుంచి శనివారం వరకు నార్సింగి పోలీసులు విచారించారు.

ఈరోజు విచారణ ముగిసిన అనంతరం అతనిని పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. విచారణ అనంతరం కోర్టు అతనికి అక్టోబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.


More Telugu News