జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్.. అవకాశాల కోసం తనే నా భర్తను ట్రాప్ చేసిందన్న జానీ భార్య
- ఆమెకు చాలామందితో సంబంధం ఉందని ఆరోపణ
- అందుకే తన భర్త దూరం పెట్టాడని వెల్లడి
- కక్షతోనే తప్పుడు కేసు పెట్టిందంటూ ఫిల్మ్ చాంబర్ ను ఆశ్రయించిన సుమలత
‘నా భర్తను ట్రాప్ చేసి, ఇంటికి కూడా రాకుండా చేసింది.. ఐదేళ్ల పాటు నాకు నరకం చూపించింది. చివరకు నేను ఆత్మహత్యాయత్నం చేసేంత వరకూ తీసుకెళ్లింది’ అంటూ జానీ మాస్టర్ బాధితురాలిపై ఆయన భార్య సుమలత సంచలన ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ బాధితురాలిపై తాజాగా ఫిలిం ఛాంబర్ లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలిపై మండిపడింది. కొరియోగ్రాఫర్ గా అవకాశాల కోసం బాధితురాలే తన భర్త జానీ మాస్టర్ ను ట్రాప్ చేసిందని చెప్పింది.
జానీని ఇంటికి రానివ్వలేదని, పెళ్లి చేసుకోవాలని నిత్యం వేధించేదని ఆరోపించింది. ‘నా భర్త ఇంటికి సరిగా రాకపోవడంతో నేనే బాధితురాలి ఇంటికి వెళ్లాను. జానీ మాస్టర్ ను నువ్వు ఇష్టపడితే నేనే తప్పుకుంటా. ఆయన జీవితంలో నుంచి వెళ్లిపోతానని చెప్పా. అయితే, బాధితురాలు మాత్రం జానీ తనకు అన్నయ్య లాంటి వాడు అని చెప్పడంతో నమ్మేశా’ అని సుమలత తెలిపింది.
వాస్తవానికి ఇక్కడ బాధితురాలు ఆ అమ్మాయి కాదు తామేనని జానీ మాస్టర్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అమ్మాయికి తన భర్తతో పాటు చాలామందితో సంబంధం ఉందని సుమలత చెప్పింది. ఈ విషయం తెలిసి తన భర్త ఆమెను దూరం పెట్టాడని వివరించింది. దీంతో తప్పుడు కేసు పెట్టి తన భర్తపై కక్ష సాధిస్తోందని సుమలత ఆరోపించింది.
ఆ అమ్మాయితో పాటు వాళ్ల అమ్మ కూడా తమను వేధించారని, తప్పుడు కేసు పెట్టిన ఆ తల్లీకూతుళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తనకు, తన పిల్లలకు ఏం జరిగినా వారిదే బాధ్యత అని, తమకు న్యాయం చేయాలని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కు సుమలత ఫిర్యాదు చేసింది.