హీరో నానికి 'యెల్లమ్మ' కథ ఎందుకు నచ్చలేదో తెలుసా?
- నానికి కథ చెప్పిన వేణు
- మాస్ బాటలో నాని
- శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సినిమా
బలగం చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు వేణు ఎల్దండి. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఊరురా బలగం చిత్రాన్ని తెరలను కట్టుకుని మరీ చూశారంటే ఈ చిత్రం జనాలను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం తరువాత బలగం వేణు-హీరో నానితో ఓ సినిమా చేస్తున్నాడని అప్పట్లో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇందులో కూడా వాస్తవం వుంది. బలగం చిత్రం చూసిన హీరో నాని, దర్శకుడు వేణు వర్క్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. మంచి కథతో వస్తే సినిమా చేద్దామని మాటిచ్చాడు.
ఇది తెలుసుకున్న నిర్మాత దిల్‌రాజు నానికి వేణుతో కథ కూడా చెప్పించాడు. నానికి కథ కూడా నచ్చింది. ఇక నాని హీరోగా, దిల్‌రాజు నిర్మాతగా ఈ సినిమా త్వరలోనే సెట్స్‌మీదకు వెళుతుందని అనుకున్నారు. అంతేకాదు, వేణు ఈ చిత్రానికి 'యెల్లమ్మ' అనే టైటిల్‌ను కూడా నిర్ణయించాడు. అయితే ఇంతలోనే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా నానికి ఓ కథ వినిపించాడు. అయితే మాస్ హీరోగా తన ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నంలో వున్న నానికి, వేణు కథ కంటే శ్రీకాంత్ కథలో మాస్ ఎలిమెంట్స్‌కు స్కోప్ ఎక్కువ వుండటంతో వేణు కథను పక్కన పెట్టాడని సమాచారం.
ముందుగా శ్రీకాంత్ ఓదెల కథ చేసిన తరువాతనే ఏ కథ గురించైనా ఆలోచిస్తానని చెప్పాడట. అయితే దసరా దర్శకుడు చెప్పిన కథలో వున్న కమర్షియల్ అంశాలు నానికి మాస్‌లో మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టే విధంగా వున్నాయని తెలిసింది. అయితే బలగం వేణు చెప్పిన కథలో కూడా మంచి ఎమోషన్‌తో పాటు ఓ నావెల్టీ పాయింట్ వుందని అతని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇటీవల 'సరిపోదా శనివారం' ప్రెస్‌మీట్‌లో బలగం వేణుతో సినిమా వుందా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తప్పకుండా 'మా కలయికలో సినిమా వుంటుంది. అందుకు కథ కోసం వెయిటింగ్' అంటూ సమాధానమిచ్చారు.