మూసీ నదీ గర్భంలో పట్టాలున్న వారిని గుర్తించి పరిహారం ఇస్తాం: మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్

  • త్వరలో బఫర్ జోన్‌లో నిర్మాణాలపై సర్వే చేసి, మార్కింగ్ పెడతామని వెల్లడి
  • పట్టాలు కలిగిన వారు సంబంధిత జిల్లా కలెక్టర్లను కలవాలని సూచన
  • పిల్లల విద్యా సంవత్సరం వృథా కాకుండా చర్యలు చేపడతామని హామీ
మూసీ నదీ గర్భంలో కొందరికి పట్టాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, పట్టాలు ఉన్న వారిని గుర్తించి అర్హులకు పరిహారం ఇస్తామని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ వెల్లడించారు. త్వరలో మూసీ నది బఫర్ జోన్‌లో నిర్మాణాలపై సర్వే చేస్తామన్నారు. మార్కింగ్ ప్రక్రియను చేపడతామన్నారు. బఫర్ జోన్‌లో పట్టాలు ఉన్న వారికి పునరావాసం, పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టాలు కలిగిన ఉన్న వారు సంబంధిత జిల్లా కలెక్టర్‌ను కలవాలని సూచించారు.

వారి పట్టాలను పరిశీలించిన తర్వాత పరిహారం, పునరావాసంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మూసీ నిర్వాసితుల కుటుంబాల్లోని పిల్లలపై కూడా రేపటి నుంచి రెండు రోజు పాటు సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలోని స్కూళ్లలో ఆ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకే రేపటి నుంచి నిర్వాసితుల కుటుంబాల్లోని అంగన్వాడీ చిన్నారుల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు వివరాలను సేకరిస్తామన్నారు.


More Telugu News