గ్రేటర్ పరిధిలో ఎలాంటి బ్యానర్లు, పోస్టర్లు అతికించవద్దు: అమ్రపాలి
- ఎలాంటి బ్యానర్లు అంటించవద్దని ఉత్తర్వులు జారీ చేశామన్న ఆమ్రపాలి
- కటౌట్లు, వాల్ పోస్టర్లు, వాల్ పెయింట్లపై సీరియస్‌గా వ్యవహరించాలని ఆదేశం
- సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కూడా అతికించవద్దని స్పష్టీకరణ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక నుంచి ఎలాంటి పోస్టర్లు అతికించవద్దని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ ఆమ్రపాలి వెల్లడించారు. ఎలాంటి బ్యానర్లు కట్టవద్దని, పోస్టర్లు అంటించవద్దని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఆమె మాట్లాడుతూ... కటౌట్లు, వాల్ పోస్టర్లు, వాల్ పెయింట్లపై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేశామన్నారు.
సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కూడా అతికించవద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు అతికిస్తే మాత్రం జరిమానా విధిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.