కేరళలో రెండో మంకీ పాక్స్ కేసు నమోదు... దేశంలో మూడోది

  • వెల్లడించిన కేరళ ఆరోగ్య శాఖ
  • విదేశాల నుంచి ఎర్నాకులం తిరిగి వచ్చిన వ్యక్తికి వ్యాధి
  • ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడి
కేరళలో మరో మంకీ పాక్స్‌ కేసు నమోదైంది. ఇటీవల విదేశాల నుంచి ఎర్నాకులం తిరిగి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. ఈ మేరకు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతడి నమూనాలను పరీక్షలకు పంపించగా పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. 

కేరళలో ఇది రెండో కేసు. భారత దేశంలో మాత్రం ఇది మూడో కేసు. సెప్టెంబర్ 9న తొలి మంకీ పాక్స్ కేసు నమోదయింది. అంతకుముందు, సెప్టెంబర్ 18న యూఏఈ నుంచి మలప్పురానికి వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ అయినట్టు ఆరోగ్య శాఖ ధృవీకరించింది. 

ప్రపంచవ్యాప్తంగా చూస్తే... 122 దేశాల్లో 99,518 మంకీ పాక్స్ కేసులు నమోదయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మంకీ పాక్స్ ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా వ్యాప్తిస్తుండటంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.ఈ నేపథ్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మన దేశంలో పలు మార్గదర్శకాలను జారీ చేసింది.


More Telugu News