అక్టోబర్ లో బ్యాంకులకు సెలవుల జాతర

  • ఏకంగా 14 రోజులు మూతపడనున్న బ్యాంకులు
  • దసరా సందర్భంగా వరుసగా నాలుగు రోజులు
  • గాంధీ జయంతి, దీపావళి, ఆదివారాలు కలిపి భారీగా సెలవులు
పండుగ సెలవులంటే పిల్లలకే కాదు ఉద్యోగస్తులకూ సంబరమే.. వచ్చే నెల ప్రారంభంలోనే దసరా సెలవుల నేపథ్యంలో స్కూళ్లు ఏకంగా పదమూడు రోజులు మూతపడనున్నాయి. పబ్లిక్ హాలిడేస్ లో బ్యాంకులు కూడా మూతపడతాయనే విషయం తెలిసిందే. అయితే, అక్టోబర్ లో బ్యాంకు ఉద్యోగస్తులకు సెలవుల జాతరేనని చెప్పొచ్చు. గాంధీ జయంతితో మొదలు నెలంతా సెలవులే సెలవులు. ఏకంగా నెలలో దాదాపు సగం రోజులు.. 14 రోజులు సెలవులే. 

దేశవ్యాప్తంగా వచ్చే నెల బ్యాంకు సెలవుల వివరాలు ఇవే.. 
అక్టోబర్ 2 గాంధీ జయంతి
3న దసరా ప్రారంభం
6న ఆదివారం
10న మహా సప్తమి
11న మహా నవమి
12న విజయదశమి
13న ఆదివారం
17న మహర్షి వాల్మీకి జయంతి
20న ఆదివారం
26న బ్యాంకుల మూసివేత
27న ఆదివారం
29న దీపావళి
30న ఐచ్చిక సెలవు దినం
31న నరక చతుర్దశి
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 7 రోజులే.. అక్టోబర్ 2, 10, 11, 12, 13, 26, 27 తేదీలు సెలవు దినాలుగా అధికారులు ప్రకటించారు.


More Telugu News