తెలుగు హీరోల గురించి సైఫ్ అలీ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- తెలుగు ప్రేక్షకులు తమ హీరోలను దేవుళ్లుగా చూస్తారన్న సైఫ్
- దర్శక నిర్మాతలు కూడా ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని సినిమా తీస్తారని వ్యాఖ్య
- దక్షిణాది దర్శకులు హీరోలను చూపించే తీరు ఆశ్చర్యపరుస్తుందన్న సైఫ్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన 'దేవర' మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో అలరించారు. మరోవైపు ఓ ఆంగ్ల వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ మాట్లాడుతూ... తెలుగు హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు ప్రేక్షకులు వారి అభిమాన హీరోలను దేవుళ్లలా చూస్తారని సైఫ్ అన్నారు. దర్శక నిర్మాతలు కూడా ఫ్యాన్స్ కు ఏం కావాలనే పాయింట్ లోనే సినిమాను తెరకెక్కిస్తారని చెప్పారు. ప్రతి కథపై దర్శకనిర్మాతలు, హీరోలు స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారని తెలిపారు. 'బాహుబలి' ఒక గొప్ప చిత్రమని... సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతమని చెప్పారు. 'దేవర' సినిమాలో డైలాగ్స్ విషయంలో తనకు కొరటాల శివ చాలా సాయం చేశారని తెలిపారు. దక్షిణాది దర్శకులు హీరోలను చూపించే తీరు తనను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పారు.