తెలంగాణ వరద బాధితులకు రిలయన్స్ సాయం.. సీఎంకు రూ.20 కోట్ల చెక్కు అందజేత
--
తెలంగాణలో ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు నిరాశ్రయులుగా మారిన ప్రజలను ఆదుకోవడానికి రిలయన్స్ కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ తరఫున రూ.20 కోట్ల విరాళం ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం రిలయన్స్ కంపెనీ యజమాని ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ తరఫున వచ్చిన ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. కంపెనీ తరఫున రూ.20 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
రిలయన్స్ కంపెనీ ప్రతినిధులతో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. కాగా, వరద బాధితులకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా తోచిన విరాళం పంపిస్తున్నారు.