షేక్ హసీనాను గద్దె దింపడం వెనక కుట్ర.. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ సంచలన వ్యాఖ్యలు

  • హసీనా గద్దె దిగడం యాదృచ్ఛికం కాదన్న యూనస్
  • పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్రేనని వెల్లడి 
  • మాఫుజ్ అబ్దుల్లా పేరును ప్రస్తావించిన తాత్కాలిక సారథి
షేక్ హసీనాను గద్దె దింపడం వెనక పక్కా ప్లాన్‌తో జరిగిన కుట్ర ఉందని బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి, నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరిగిన క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ విద్యార్థి నేతలు దేశానికి కొత్త రూపు తెచ్చారని కొనియాడారు. వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

బంగ్లాదేశ్ అల్లర్ల వెనక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు బయటపడలేదని పేర్కొన్న యూనస్.. మాఫుజ్ అబ్దుల్లా పేరును ప్రస్తావించారు. హసీనాను గద్దె దింపడంలో ఆయన హస్తం ఉండొచ్చని అనుమానించారు. హసీనా గద్దె దిగడం యాదృచ్ఛికంగా జరగలేదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందేనని నొక్కి వక్కాణించారు. బంగ్లాదేశ్ అల్లర్లు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వైదొలగి భారత్‌కు పారిపోయి ఆశ్రయం పొందారు. దీంతో 84 ఏళ్ల యూనస్ దేశ చీఫ్ అడ్వైజర్‌గా నియమితులయ్యారు.


More Telugu News