జగన్ డిక్లరేషన్ సంగతి టీటీడీ చూసుకుంటుంది: పవన్ కల్యాణ్

  • ఈరోజు తిరుమలకు వెళుతున్న జగన్
  • డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకోవాలంటున్న హిందూ సంఘాలు
  • అన్యమతాల గురించి మాట్లాడొద్దని జనసైనికులకు పవన్ సూచన
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన ఏపీలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారనే వివాదం పూర్తిగా ముదిరిన వేళ ఆయన తిరుమలకు వెళుతున్నారు. జగన్ తిరుమల పర్యటనను హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు, బీజేపీ, వీహెచ్ పీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. క్రైస్తవుడైన జగన్... హిందూమతంపై, వేంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉందనే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జగన్ ను అలిపిరి వద్దే అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. జగన్ కు వ్యతిరేకంగా అలిపిరి వద్ద నిన్న పలువురు స్వామీజీలు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. 

మరోవైపు, తిరుపతిలో జగన్ కు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన నిర్ణయించినట్టు తెలుస్తోంది. డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకునే ప్రక్రియ అని... ఇతర మతాల గురించి ఎలాంటి కామెంట్లు చేయొద్దని పవన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలకు జనసేన శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. బీజేపీ శ్రేణులు అప్పుడే రంగంలోకి దిగాయి. ఇంకోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసు భద్రతను పెంచారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, నిరసన కార్యక్రమాను చేపట్టకూడదని పోలీసులు తెలిపారు.


More Telugu News