శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆహ్వానం

  • అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆహ్వాన పత్రాన్ని అందించిన ఆలయ అధికారులు
  • పవన్‌కు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించిన తిరుమల అర్చకులు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకూ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, అర్చకులు శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు గురువారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుమల ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్ కు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
ఇక, శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే .. ఉత్సవాల్లో తొలి రోజైన అక్టోబర్ 4వ తేదీన ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడ సేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, అక్టోబర్ 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి.


More Telugu News