5 కోట్ల సినిమాకి 50 కోట్ల వసూళ్లు!

  • ఈ నెల 12న విడుదలైన 'కిష్కిందకాండం'
  • మూడు ప్రధాన పాత్రలతో నడిచే కథ 
  • 12 రోజుల్లో 50 కోట్లను రాబట్టిన సినిమా
  • ఇంకా థియేటర్ల దగ్గర తగ్గని సందడి 
  • అసిఫ్ అలీ కెరియర్లో పెద్ద హిట్ 


మలయాళం ఇండస్ట్రీ నుంచి వరుసబెట్టి భారీ హిట్లు .. బ్లాక్ బస్టర్లు క్యూ కడుతున్నాయి. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన సినిమాలు, వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉండటం విశేషం. అలా రీసెంటుగా థియేటర్లకు వచ్చిన సినిమాల జాబితాలో 'కిష్కిందకాండం' కూడా చేరిపోయింది. దింజిత్ అయ్యథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన విడుదలైంది. 

అసిఫ్ అలీ .. అపర్ణ బాలమురళి .. విజయ్ రాఘవన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. గుడ్ విల్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై జోబీ జార్జ్ నిర్మించిన సినిమా ఇది. కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారని అంటున్నారు. అలాంటి ఈ సినిమా, 12 రోజులలో 50 కోట్ల రూపాయలను రాబట్టడం విశేషం. ఈ సినిమా విడుదలై రెండు వారాలైనా, థియేటర్ల దగ్గర సందడి ఎంత మాత్రం తగ్గడం లేదని సమాచారం.

 ఈ ఏడాదిలో చాలా వేగంగా భారీ వసూళ్లను రాబట్టిన టాప్ 10 సినిమాలలో ఒకటిగా ఇది చేరిపోయింది. అసిఫ్ అలీకి మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఓటీటీ పుణ్యమా అని తమిళ .. తెలుగు భాషల్లోను ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన కెరియర్ లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఫస్టు మూవీ ఇదేనని అంటున్నారు. తండ్రీ .. కొడుకు .. కోడలు .. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఈ కథ, 'దృశ్యం' స్థాయిలో ఉందనేది పబ్లిక్ టాక్. 


More Telugu News