నేడు జనసేనలో చేరనున్న బాలినేని.. ర్యాలీకి అధిష్ఠానం నిరాకరణ

నేడు జనసేనలో చేరనున్న బాలినేని.. ర్యాలీకి అధిష్ఠానం నిరాకరణ
  • ఒంగోలులో భారీ సభ నిర్వహించాలని భావించిన బాలినేని
  • అక్కర్లేదని, ఒక్కరే మంగళగిరి వచ్చి పార్టీలో చేరాలన్న జనసేన అధిష్ఠానం
  • ఆయనతోపాటు పార్టీలో చేరనున్న వ్యాపారవేత్త కంది రవిశంకర్
సాధారణంగా ఎవరైనా నేత ఓ పార్టీని వీడి మరో పార్టీలో చేరినప్పుడు భారీ బలప్రదర్శన ఉంటుంది. ఓ పెద్ద సభ, వాహనాలతో భారీ కాన్వాయ్ సాధారణంగా కనిపించే దృశ్యాలు. అయితే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం అత్యంత నిరాడంబరంగా నేడు జనసేన పార్టీలో చేరబోతున్నారు. 

ఒంగోలులో సభ పెట్టి, అనంతరం భారీ ర్యాలీగా మంగళగిరికి తరలివచ్చి పార్టీ తీర్థం పుచ్చుకోవాలని భావించారు. అయితే, ఆయన ఆశలను పార్టీ అధిష్ఠానం తుంచేసింది. సభ, బల ప్రదర్శన అవసరం లేదని, ఒక్కరే మంగళగిరి వచ్చి పార్టీలో చేరాలని ఆదేశించింది. దీంతో తొలుత నిరుత్సాహానికి గురైన ఆయన ఆ తర్వాత అందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది. మరోవైపు, బాలినేనితోపాటు ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా నేడు జనసేనలో చేరబోతున్నారు.


More Telugu News