సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గేయ రచయిత చంద్రబోస్

  • సచివాలయంలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిసిన గీత రచయిత
  • రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువా కప్పిన చంద్రబోస్
  • ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు చంద్రబోస్‌‍కు సీఎం అభినందన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. సీఎంకు చంద్రబోస్ పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో చంద్రబోస్ రాసిన 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు చంద్రబోస్‌ను రేవంత్ రెడ్డి అభినందించారు. అనంతరం చంద్రబోస్‌కు శాలువా కప్పి సన్మానించారు.

వరద బాధితుల సహాయార్థం కిమ్స్ అధినేత కోటి విరాళం

వరద బాధితుల సహాయార్థం కిమ్స్ ఆసుపత్రుల అధినేత రూ.1 కోటి విరాళం అందించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి.భాస్కర్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు కిమ్స్ ఆసుపత్రి అధినేతను సీఎం ప్రశంసించారు.


More Telugu News