అడవిలో వెంటాడే దెయ్యం .. ఓటీటీలో భయపెడుతున్న 'పేచి'
- తమిళంలో విడుదలైన 'పేచి'
- ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్
- ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ
- హైలైట్ గా నిలిచిన ఫొటోగ్రఫీ
- భయపెడుతున్న కంటెంట్
ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై స్ట్రీమింగ్ అవుతున్న హారర్ థ్రిల్లర్ సినిమాలలో 'పేచి' ఒకటి. తమిళంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను భయపడుతోంది. టైటిల్ తోనే అందరిలో ఉత్కంఠను రేకెత్తించిన సినిమా ఇది. ఆగస్టు 2వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, గాయత్రి .. శరణ్య .. దేవ్ రామ్ నాథ్ .. ప్రీతి .. జనా .. తదితరులు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ కథ అంతా కూడా ఫారెస్టు నేపథ్యంలో నడుస్తుంది. ఒక యువజంట సరదాగా ఈ అటవీ ప్రాంతానికి వెళుతుంది. అక్కడ మంట వేసుకోవడానికి పుల్లలు అవసరం కావడంతో, వాళ్లు ఒక చెట్టు నుంచి ఎండిన కొమ్మను నరుకుతారు. ఆ కొమ్మను నరికిన చోటు నుంచి ఒక భయంకరమైన బొమ్మ బయటికి వస్తుంది.
ఆ యువజంట ఏమైపోయింది ఎవరికీ తెలియదు. ఆ తరువాత కొంత కాలానికి ఐదుగురు స్నేహితులు ట్రెక్కింగు కోసం అదే ఫారెస్టుకు చేరుకుంటారు. లోకల్ గైడ్ 'మారి'ని వెంటబెట్టుకుని అడవి లోపలికి చేరుకుంటారు. ఒక చోట నిషేధిత ప్రాంతాన్ని సూచిస్తూ హెచ్చరిక బోర్డు ఉంటుంది. ఆ ప్రాంతంలో దెయ్యాలు తిరుగుతుంటాయని రాసి ఉంటుంది. మారి చెబుతున్నా వినిపించుకోకుండా ఈ స్నేహితులు అటుగా వెళతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేదే కథ. రాజేశ్ మురుగేశ్వరన్ అందించిన నేపథ్య సంగీతం, పార్తీబన్ కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తున్నాయి.