దేవర సాక్షిగా ఫ్యాన్స్ వార్‌కు చరమగీతం పాడండి: యువ నిర్మాత ట్వీట్
- అభిమానులకు నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్
- దేవరతో ఈ వార్‌కు స్వస్తి పలకండంటూ సూచన
- అందరూ సినిమాను ఎంజాయ్ చేయండన్న నాగవంశీ
ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (27న) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సాధారణంగా సినిమా విడుదల సమయాల్లో సోషల్‌మీడియాలో ఫ్యాన్స్ మధ్య కొన్ని చర్చలు జరుగుతుంటాయి. ఒక్కోసారి అవి ఇబ్బందికరంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో దేవర సాక్షిగా అభిమానులు ఫ్యాన్స్ వార్‌కు చరమగీతం పాడాలని ప్రముఖ యువ నిర్మాత, దేవర పంపిణీదారుడుల్లో ఒకరైన నాగవంశీ అభిమానులకు తన తరపున ఓ విన్నపం చేశాడు.
ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ''తారక్ అన్న చాలా విరామం తరువాత మంచి ఎమోషన్ కంటెంట్‌తో వస్తున్నారు. తన బెస్ట్ ఇవ్వడంతో పాటు ఓ మంచి కంటెంట్‌తో రాబోతున్నాడు. ప్రభుత్వాల సహకారంతో చాలా రోజుల తరువాత ఏపీలో ముందస్తు ప్రదర్శనలు వేస్తున్నాం. వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. కాబట్టి మా నుంచి మీకు ఒక విన్నపం. మీరు కూడా ప్రశాంతంగా, రెస్పాన్స్‌బుల్‌గా వుండండి. అనవసరమైన ప్యాన్స్ వార్‌ను క్రియేట్ చేయొద్దు. ఇలాంటి వాటి వల్ల మనమే నెగిటివిటీని ఆహ్వానించినట్లు. దీని వల్ల తాత్కాలిక ఉత్సాహం, వున్నా, తరువాత మన హీరో సినిమాకే అది ఎఫెక్ట్ అవుతుంది.
ఈ సందర్భంగా అభిమానులంతా ఈ గొడవలు ఆపేసి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. దేవర సాక్షిగా ఈ ఫ్యాన్స్ వార్ ఆగిపోయేలా చూద్ధాం. అందరూ ఈ విషయంపై ప్రతిన పూనండి. దీనితో పాటు ఫస్ట్ స్క్రీనింగ్‌లో సినిమా చూసే అభిమానులు సోషల్‌మీడియాలో సినిమా వీడియోలు షేర్ చేయకండి. ఎవరూ వీడియోలు తీయకుండా చూడండి. మీ తరువాత చూసే వాళ్లను, అభిమానులను సినిమాను ఎంజాయ్ చేయనివ్వండి. తారక్ అన్నకు ఎప్పటికీ మధురానుభూతిలా మిగిలిపోయే బ్లాక్‌బస్టర్‌ను మనం అందరం కలిసి ప్రేమతో ఇద్దాం. దేవర సెప్పిండు అంటే సేసినట్టే' అని నాగ వంశీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.