'గేమ్ ఛేంజర్' అప్ డేట్స్ విషయంలో స్పీడ్ పెంచాలట!
- లిరికల్ సాంగ్ ప్రకటన
- నిరాశలో అభిమానులు
- విడుదల డేట్‌పై రాని క్లారిటి
ఆర్‌ఆర్‌ఆర్ తరువాత రామ్‌చరణ్ సినిమాల విషయంలో గ్యాప్ రావడంతో, అభిమానులు ఆయన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ నాయిక. అయితే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ లేకపోవడంతో చరణ్ అభిమానులు కాస్త నిరాశగానే వున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదల తేది విషయంలో క్లారిటీ లేదు. ఈ డిసెంబరులో కిస్మస్ పర్వదినాన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని వార్తలు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
అయితే చాలా రోజుల తరువాత బుధవారం గేమ్ ఛేంజర్ అప్‌డేట్ రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. సోషల్‌మీడియాలో వున్న ట్రెండ్‌ను బట్టి అందరూ రిలీజ్ తేదీని అనౌన్స్ చేస్తారని అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ రోజు కూడా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. ఈ చిత్రం నుంచి మరో లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్టుగా పోస్టర్‌ను వదిలారు. అంతేకాదు పోస్టర్‌లో లిరికల్ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారనే విషయం కూడా మెన్షన్ చేయలేదు. కేవలం అవైటెడ్ సాంగ్ రా మచా రా మచా అంటూ అనౌన్స్ చేశారు.
దీంతో మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఇంత ఊరించి ఊసూరుమనిపించారు అనే ఫీలింగ్‌లో వున్నారు ఫ్యాన్స్. ఇకనైనా ఈ సినిమా అప్‌డేట్స్ విషయంలో మేకర్స్ కాస్త స్పీడు పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు తన బ్యానర్‌లో 50వ సినిమాగా గేమ్ ఛేంజర్‌ను నిర్మిస్తున్నాడు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.