ఏపీలో నేడు వరద బాధితులకు పరిహారం చెల్లింపులు
- భారీ వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాడ అతలాకుతలం
- వరద బాధితులకు ఇప్పటికే పరిహారం ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు
- విజయవాడ కలెక్టరేట్ నుండి నేడు పరిహారం చెల్లింపును ప్రారంభించనున్న సీఎం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన మీడియాకు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మునుపెన్నడూ లేని విధంగా విజయవాడ వరదలకు అతలాకుతలం అయింది.
ఈ క్రమంలో 10 రోజులు పాటు విజయవాడ కలెక్టరేట్ లోనే సీఎం చంద్రబాబు మకాం వేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందేలా యంత్రాంగాన్ని నడిపించారు. బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యుమరేషన్ పూర్తి చేసింది. నష్టపరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రకారం వరదల్లో నష్టపోయిన బాధితులకు ఈరోజు (బుధవారం) ముఖ్యమంత్రి పరిహారం విడుదల చేయనున్నారు. అర్హులైన బాధితులందరికీ నేరుగా వారి ఖాతాల్లోకే పరిహారం డబ్బులు జమ చేయనున్నారు.