ఇంతకీ.. దేవర రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

  • 15 నిమిషాలు నిడివి తగ్గిన దేవర 
  • ప్రస్తుతం 2 గంటల 50 నిమిషాల నిడివి 
  • ఓవర్సీస్‌ ప్రీసేల్స్‌లో వన్‌ మిలియన్ మార్క్‌
ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం దేవర. ఎన్నో అంచనాల నడుమ ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్‌ నాయికగా నటించిన ఈ చిత్రంలో  దేవ, వర అనే రెండు విభిన్నమైన పవర్‌ఫుల్ రోల్స్‌లో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంతో అలరించబోతున్నాడు. 

కాగా, రెండు పార్ట్‌లుగా రాబోతున్న దేవర మొదటి పార్ట్‌ రన్‌టైమ్‌లో కాస్త మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు లాక్‌ చేసిన సినిమా నిడివిలో దాదాపుగా ఏడు నిమిషాలు ట్రిమ్‌ చేసి తొలగించినట్లుగా తెలిసింది. 170 నిమిషాల 58 సెకనులు ( 2 గంటల 50 నిమిషాలు)  వున్న రన్‌టైమ్‌తో దేవర చిత్రం ప్రేక్ష్‌కులను పలకరించబోతుంది. ధూమపానం హెచ్చరిక మినహాయిస్తే ఈ మూవీ రన్‌టైమ్‌ రెండు గంటల నలభై రెండు నిమిషాలు వుంది. సెన్సారు బోర్డు వారు ఈ చిత్రానికి యూ\ఏ సర్టిఫికెట్‌ జారీ చేసిన నిడివి 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు వుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంతటా మంచి బజ్‌ నెలకొని వుంది. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా పాజిటివ్‌గా వున్నాయి. 

ముఖ్యంగా విదేశాల్లో ఈ చిత్రం ప్రీసేల్‌ బుకింగ్స్‌లో వేగంగా వన్‌ మిలియన్‌ డాలర్‌ మార్క్‌ను చేరుకుంది. అంతేకాదు, లాస్‌ ఏంజెల్స్‌ లో జరగనున్న బియాండ్‌ ఫెస్ట్‌లో షో చేయనున్న తొలి ఇండియన్‌ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగానే సోమవారం రాత్రి ఎన్టీఆర్‌ లాస్‌ ఏంజెల్స్‌ చేరుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవర చిత్రం టిక్కెట్ల పెంపుకు, అదనపు షోలకు అనుమతులు రావడంతో ఈ చిత్రం ప్రివ్యూలు కూడా వేస్తున్నారు. అంతేకాదు, తొలిరోజు ఈ సినిమా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.


More Telugu News