శ్రీవారి లడ్డూలో పొగాకు ప్యాకెట్ అంటూ ప్రచారం... స్పందించిన టీటీడీ
- లడ్డూలో పొగాకు ప్యాకెట్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత నియమనిష్టలతో లడ్డూలు చేస్తారన్న టీటీడీ ఈవో
- పొగాకు ప్యాకెట్ అంటూ ప్రచారం చేయడం బాధాకరమని వెల్లడి
ఇప్పటికే తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం అట్టుడికిస్తుంటే, శ్రీవారి లడ్డూలో పొగాకు ప్యాకెట్ కనిపించింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు ఓ వీడియో కూడా దర్శనమిస్తోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది.
తిరుమలలోని పోటులో వైష్ణవ బ్రాహ్మణులు ఎంతో నియమనిష్టలతో, భక్తిశ్రద్ధలతో లడ్డూలు తయారుచేస్తారని, లడ్డూలో పొగాకు ప్యాకెట్ అంటూ ప్రచారం చేయడం సబబు కాదని టీటీడీ ఈవో జె.శ్యామలరావు పేర్కొన్నారు.
లడ్డూల తయారీ ప్రక్రియపై నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, ఇంత కట్టుదిట్టంగా లడ్డూలు తయారుచేస్తుంటే, పొగాకు ప్యాకెట్ అంటూ ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు.